సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం ఇరగవరం మండలంలో చేపట్టిన ఈ కార్యక్రమం ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మండల స్థాయి అధికారులు మండలంలో గల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది మోటార్ సైకిల్ పై ఇరగవరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వలన సామాన్య ప్రజలకు రైతులకు చిరు వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరించారు, అదేవిధంగా ఇన్సూరెన్స్ సేవా రుసుము తగ్గింపు ద్వారా కలిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించారు.


