ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు డిపోలో యాజమాన్యం కొత్తగా పెట్టిన పని భారం పెరిగిన రెస్ట్ ఆఫ్ డ్యూటీల యొక్క ఇన్కమింగ్ టైము కిలోమీటర్లు తగ్గించమని, డ్రైవర్ గారపాటి రామారావు అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, వెహికిల్ కండిషన్ ను మెరుగు పరచాలని, డిపోలోని మిగిలిన ఇతర సమస్యలపైన తణుకు డిపో నేషనల్ మజదూర్ అసోసియేషన్ 14 నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగినది.
ఈ రిలే నిరాహారదీక్షలో మొదటిరోజు తణుకు డిపో డ్రైవర్ లు, దూపగంట్ల రాంబాబు, ముదునూరి జగన్నాధరాజు, పుట్టా వెంకట నాగసుబ్రహ్మణ్యం
వేల్పూరి రాంబాబు, గారపాటి రామారావు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్ష శిబిరంను నేషనల్ మజదూర్ యూనిటీ అసోసియేషన్ డిపో సెక్రటరీ బయ్యే సుబ్బారావు, ప్రెసిడెంట్ సరిదే ఏసుబాబు ప్రారంభించారు. నేషనల్ మజదూర్ అసోసియేషన్ డిపో చైర్మన్ తులసి శ్రీనివాసరావు నిమ్మరసం ఇచ్చి మంగళవారం శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ దీక్షకు SWF, బహుజనసమాజ్ నాయకులు సంఘీబావం ప్రకటించారు.


