13 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు CPR ( కార్డియో- పల్మనరీ పునర్జీవం) పై నిర్వహించే అవగాహన కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారి డా.బి.దుర్గమహేశ్వరరావు CPR పై ప్రతిఙ్ఞ చేయించి, CPR చేయు విధానం గురించి, సిబ్బందికి, పౌరులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా ఎలక్ట్రిక్ షాక్, యాక్సిడెంట్, నీటిలో మునిగి పోవడం, మొదలగు వాటివల్ల వారి యొక్క గుండె కొట్టుకొనుట ఆగిపోయి, అచేతనంగా పడిపోయినపుడు, ముందుగా దగ్గరలోని ఆసుపత్రికి వైద్య సహాయం కొరకు తరలించుటకు 108 లేదా ఇతర అంబులెన్స్ లకు ఫోన్ చేసి, తదుపరి, ఆ పరిసరాలను గుర్తించి, ఆ వ్యక్తిని సురక్షితమైన ప్రదేశమునకు తీసుకువచ్చి, నాడీ చూసి, నాడీ కొట్టుకోవటం లేదు అని గుర్తిస్తే, వెంటనే CPR చేయవలెనని, అలా చేసే సందర్భంలో, ఆ వ్యక్తి కదలిక (ప్రతిస్పందన) వచ్చిన వెంటనే ఆపివేసి, ఎమర్జెన్సీ వాహనంలో వైద్య సహాయమునకు తరలించవలెనని, ఈ విధముగా చేయడం వలన ప్రతీ 100 మంద లో 85 మంది వరకు, ప్రాణ రక్షణ చేయవచ్చునని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఓ. ఎం. సుబ్రహ్మణ్యం, ఎం.పి.హెచ్.ఎస్ శ్రీరామమూర్తి, రత్నకుమారి, స్టాఫ్ నర్స్ బ్యూలా, ఝాన్సీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


