- ఉండ్రాజవరం:
రైతులకు అవసరమైన అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని చివటం గ్రామంలో, గ్రామ రైతులకు నిర్వహించిన జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, బయో పెస్టిసైడ్, పాల క్యాన్స్, ఆక్వా పరికరాలు, డ్రిప్, స్ప్రింక్ లర్ పరికరాలు కు 12 శాతం నుండి 5శాతం కు మరియు టైర్స్,విడిభాగాలు, డ్రోన్ లపై 18 శాతం నుండి 5 శాతం కు జీఎస్టీ మినహాయింపు దొరుకుతుందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు, ప్రజలకు జిఎస్టి తగ్గింపు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ట్రాక్టర్ల తో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చివటం పిఎసిఎస్ కమిటీ చైర్ పర్సన్ ముళ్ళపూడి చిన వెంకట పాండురంగారావు, రైతులు కుదప రమేష్, ఈడుపుగంటి పాండురంగారావు, గారపాటి రాఘవులు, బొబ్బ చిన్న, చిలుకూరి సత్యనారాయణ, సొసైటీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


