వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
కంట్రోల్ రూమ్ వివరాలు: స్థలం: కలెక్టరేట్, రాజమహేంద్రవరం ..ఫోన్ నెంబర్లు: 9493206371, 9908454580
** టోల్ ఫ్రీ నెంబర్: 1800-425-8585 (24 గంటలు అందుబాటులో)
విధుల్లో ఉన్న సిబ్బంది ప్రజల ఫిర్యాదులు నమోదు చేసి సంబంధిత విభాగాలకు తెలియజేయాలన్నారు.
- కె. రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ .. డ్యూటీ సమయం: ఉదయం 6.00 – మధ్యాహ్నం 2.00 ఫోన్: 94400 12345 పి. విజయలక్ష్మి – సీనియర్ అసిస్టెంట్ డ్యూటీ సమయం: మధ్యాహ్నం 2.00 – రాత్రి 10.00 ఫోన్: 94400 67890 ఎం. సుబ్బారావు – జూనియర్ అసిస్టెంట్ డ్యూటీ సమయం: రాత్రి 10.00 – ఉదయం 6.00 ఫోన్: 94401 24680 ,
షిఫ్ట్ లలో ఉన్న సిబ్బంది అందచేసే నివేదికలను ఎస్. పద్మావతి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదిక ను కలెక్టర్ కు పంపించాలన్నారు.
ప్రజలకి కలెక్టర్ సూచనలు:
- తక్కువ భూభాగాలు, వాగులు, చెరువుల దగ్గర ప్రజలు వెళ్లరాదు.
- విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు, ముంపు నీటిలో నడవడం పూర్తిగా మానుకోవాలి.
- అధికారులు రక్షణ, వైద్య, రవాణా, మున్సిపల్, పంచాయతీ శాఖలతో సమన్వయంగా పని చేయాలి.
- అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నెంబర్లను సంప్రదించాలి.


