— జిల్లా కలెక్టర్ – కీర్తి చేకూరి
జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి, “వికాస” ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27వ తేదీ (శనివారం) ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమీపంలోని వికాస కార్యాలయం (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఉద్యోగ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000/- నుండి రూ.24,000/- వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఆయా సంస్థల ప్రకారం కల్పించబడతాయి.
ఆసక్తిగల అభ్యర్థులు అసలు సర్టిఫికెట్లు మరియు జెరాక్స్ కాపీలు తీసుకొని తప్పనిసరిగా హాజరుకావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ కే. లచ్చా రావు సూచించారు.
మరిన్ని వివరాల కోసం: ఫోన్ నెంబర్ 7660823903 లేదా www.vikasajobs.com సంప్రదించాలని కోరారు


