ఎర్రాయిచెరువు గ్రామసర్పంచ్ అధ్యక్షతన పోలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది దీనిలో భాగంగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను గురుంచి మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు రైతులకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సార్వా సీజన్ నుండి గ్రేడ్ -A ధాన్యానికి రూ 2389 .00 మరియు సాధారణ రకమునకు రూ 2369 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించారాని తెలియజేశారు. E- పంట నందు నమోదు చేసుకున్నటువంటి రైతుల నుంచి మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటారని అలాగే రైతులు వారు కోరుకున్న మిల్లులకే ధాన్యాన్ని తరలించుకోవచ్చు అని ధాన్యాన్ని, మిల్లుల యొక్క లక్ష్యం, బ్యాంక్ గ్యారంటీ లభ్యత ఆధారంగా ధాన్యాన్ని తరలించవచ్చని తెలియజేశారు. ట్రక్ షీట్ జనరేట్ కాకుండా రైస్ మిల్లులకు తరలించకూడదని ధాన్యం, లోడ్ అయిన తర్వాత వెంటనే ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత మాత్రమే మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేయాలని తెలియజేశారు RSK ల వద్ద ప్రదర్శించబడే QR కోడ్ ని ఉపయోగించి సేకరణ సమయంలో ఏమైనా సమస్యలను నివేదించే QR కోడ్ విధానాన్ని ఈ సార్వా సీజన్ నుంచి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్నారని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రాయిచెరువు గ్రామ సర్పంచ్ జుత్తుగ వెంకట మహేశ్వరరావు, ఎర్రాయిచెరువు రైతుసోదరులు తదితరులు పాల్గొన్నారు.


