పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు మార్కెట్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు కొండేటి శివ జన్మదిన వేడుకలు బుధవారం తణుకులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొండేటి శివను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేకు కట్ చేశారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


