ఇరగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కంతేరు గ్రామము నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశ పెట్టిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కంతేరు సర్పంచ్ గుడిమెట్ల ఆదిలక్ష్మి, ఎంపీటీసీ గుడిమెట్లవీర్రెడ్డి, గ్రామనాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలకు వైద్యసేవలు అందించుటకు ప్రసూతి వైద్య నిపుణులు, కంటిపరీక్షలు, కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు, వృద్దులకు ఆరోగ్యపరీక్షలు, క్షయ వ్యాది నిర్ధారణ పరీక్షలు చేసారు. సాదారణ అనారోగ్యరోగులను పరీక్షించి వైద్యులు 135 మంది రోగులకు వైద్యసేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో కంతేరు గ్రామ నాయకులు సత్తి సోమ శేఖర రెడ్డి, ముప్పిడి నర్సింహమూర్తి, పెచ్చెట్టి ప్రసాద్, బలం ఫణికుమార్, ఇరగవరం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. వి.ఎల్.క్రాంతి రెడ్డి, సి.హెచ్.ఒ. ఎస్.కె. ఖాన్ సాహెబ్, సూపర్వైజర్లు మూర్తి, మంగతాయారు, ఎం.ఎల్.హెచ్.పి. లు , ఎ.ఎన్.ఎం.లు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇతర ఆరోగ్య సిబ్బంది సచివాలయం కార్యదర్శి వంగ రాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


