ప్రముఖ కవి గురజాడ అప్పారావు జయంతిని సాహితీ సామ్రాజ్యం సంస్థ ఆధ్వర్యంలో తణుకు గురజాడ విద్యానికేతన్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు పాడినాడ తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ వాడుక భాషకు తొలి జాడ గురజాడ అని అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్రపై సదస్సును నిర్వహించగా పలువురు ఆయన జీవిత విశేషాలను వివరిస్తూ కవితల ప్రాముఖ్యత పై మాట్లాడారు. అనంతరం తణుకు ప్రాంతంలో ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యంను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవిత్వానికి పితామహుడు వెలుగు జాడ గురజాడ అని అన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ విద్యానికేతన్ ఇంచార్జ్ మమత ప్రముఖ మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్, అదేవిధంగా మండవల్లి చిన్నరామయ్య, నండూరి సూర్యనారాయణ మూర్తి, మందరపు సాయిబాబా, నాదెళ్ల కృష్ణానందం, కె.నాగభూషణ రెడ్డి, బర్రె శ్రీనివాస్, మహమ్మద్ షాలిహ, ఎండి. కమాలుద్దీన్, ఆకెళ్ళ సుబ్రమణ్యం, ఆలపాటి సుబ్బారావు, ముక్కామల మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


