ప్రతి కుటుంబానికి పెద్దకొడుకులా చంద్రబాబు

ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా కల్పించేలా ‘కూటమి’ చర్యలు

వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

53 మందికి రూ. 39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద కొడుకులా అండగా ఉంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంతోపాటు రూరల్ మండలం పరిధిలోని 53 మందికి రూ.39 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి ఎమ్మెల్యే మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని భావించిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబంలో ఏ ఒక్కరు అనారోగ్యం పాలైనా ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతుందని ఇది గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్యం బారిన పడి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి అండగా ఉండాలని ఉద్దేశంతో నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా మానవత్వంతో కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతోందని చెప్పారు. భవిష్యత్తులో ఒక్క కుటుంబానికి రూ. 25 లక్షలు మేర బీమా సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో 1.60 కోట్లు కుటుంబాలకు ఈ బీమా సదుపాయం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link