విద్యుత్ బస్సులను ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని సిఐటియు జిల్లా నాయకులు కామన్ మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఆర్టీసీ ఎస్ .డబ్ల్యూ .ఎఫ్ యూనియన్ తణుకు డిపో మహాసభ ప్రసాదు అధ్యక్షతన మంగళవారం నాడు తణుకు లొ అమరవీరుల భవనంలో జరిగినది. ఈ మహాసభలో కామన ముని స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము విద్యుత్ బస్సుల పథకం పేరుతో సబ్సిడీతో కూడిన విద్యుత్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుందని వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నారని ఇది సరైన విధానం కాదని మునిస్వామి అన్నారు .రాష్ట్రంలో శ్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తుందని దీనికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ముఖ్యమంత్రి తెలియజేశారని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కార్మిక సంఘాలు వ్యతిరేకం కాదని దానితోపాటు కార్మికులు ఉండే ఇబ్బందులనుకూడ ప్రభుత్వం ఆలోచించాలని మునుస్వామి తెలిపారు. ఉచిత బస్సు విధానం వల్లన కార్మికులపై పని భారం పెరుగుతుందని అన్నారు . బస్సులు సంఖ్యను కార్మికుల సంఖ్యను పెంచకుండా పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వము అనాలోచితన విధానం అని మునుస్వామి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి 2 వేల ఎకరాలు విలువైన స్థలాలు ఉన్నవని వాటిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ఆలోచనలో పాలకులు ఉన్నారని దీనిలో భాగంగానే విజయవాడ, విశాఖపట్నం సిటీలోని స్థలాలను లూలు షాపింగ్ మాల్ ఇవ్వడాన్ని రద్దు చేయాలని మునిస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే కార్మికులు ప్రజల సహకారంతో ఉద్యమాలను చేస్తారని తెలిపారు. ముందుగా సంఘం ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ నిర్వహించి నిర్వహించినారు
ఈ మహాసభలో నూతన కమిటీ ఎన్నిక జరిగినది.
నూతన కమిటీ
అధ్యక్షులు కొమర పూరి నూకరాజు ఉపాధ్యక్షులు 1.చింతల రామకృష్ణ 2.తరిపట్ల వెంకట శ్రీనివాసమూర్తి కార్యదర్శి నూతలపాటి శ్రీనివాసు సహాయ కార్యదర్శులు 1.కొమ్మలకుల గణేష్ నాగ వెంకట సాయి కుమార్
- కొండా బత్తుల నాగ వెంకట సూర్య చందర్రావు
ట్రెజరర్ అనంతపల్లి ప్రసాద్
రామేశ్వరపూ నాగ వెంకట దుర్గారావు ప్రచార కార్యదర్శి పేకేటి వెంకట సత్యనారాయణ ఎన్నిక అయినారు.


