మంత్రి కందుల దుర్గేష్‌ను విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కలెక్టర్ కీర్తి చేకూరి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల ప్రోత్సాహం, సినీ రంగానికి అనుబంధ మౌలిక వసతులు, అలాగే జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్య అంశాలు చర్చకు వచ్చాయి.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, దీనిని మరింతగా అభివృద్ధి పరచడానికి కలెక్టర్ కృషి చేయాలని సూచించారు. రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా అభివృద్ధి అంశాలపై సమగ్ర ప్రజెంటేషన్ సిద్ధం చేసి సమర్పించాలని ఆయన ఆదేశించారు.

మంత్రి సూచనల మేరకు అన్ని శాఖలతో సమన్వయం కలిగి, అభివృద్ధి ప్రాధాన్యతా రంగాలలో తక్షణ చర్యలు చేపడతామని కలెక్టర్ కీర్తి చేకూరి హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link