మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి – ఇంజనీర్స్ డే

ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోతున్నది. రైలును ఆపండి..అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన మేధావి వెెూక్షగుండం  విశ్వేశ్వరయ్య.మేధోసంపత్తి
ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్‌ బరాజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమించారు.అద్వితీయమైన మేధోసంపత్తితో సింధూనది నీటిని సుద్నోరుకు చేరేలా చేశారు.ఆ నీటిని నిల్వ చేయడానికి వినూత్న విధానం కూడా రూపొందించారు.దాహరి దగ్గర నంబనది మీద సైఫన్‌ పద్ధతిన కట్టను నిర్మించారు.అక్కడ విశ్వేశ్వర య్య ఆటోమేటిక్‌ గెట్లను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు.1906లో ఎడెన్‌ నగరం నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు.ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా నియమించింది.కొల్లాపూర్‌, ధార్వాడ, బీజాపూర్‌ తదితర పట్టాణాల్లో మంచినీటి పథకాలను రూపొందించారు.ఆయన ఆధ్వర్యంలోనే ముసికి వరదలను నివా రించేందుకు హుస్సేన్‌సాగర్‌ వంటి నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్‌కు విస్తృత సేవలు అందించారు.స్వరాష్ట్రమైన మైసూర్‌ సంస్థానాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని 1909లో ఆ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌గా నియమించింది.హెబ్బాళ్‌ వ్యవసాయ కళాశాల, మైసూర్‌ విశ్వవిద్యాలయం, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, సోప్‌ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్‌ను విశ్వేశ్వరయ్య నెలకొల్పారు.ఆయన ప్ర జ్ఞతో నిర్మించిన కృష్ణారాజ సాగర్‌తో లక్షలాది ఎకరాలు సస్యశ్యా మల మ య్యాయి.రెండవ ప్రపంచయుద్ధం సమయంలో ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైంది.విశ్వేశ్వరయ్య సల హా మేరకు బెంగళూరులో విమాన కార్ఖానా, విశాఖలో నౌకయాన ని ర్మాణం ప్రారంభించారు.90ఏళ్ల వయస్సులో అప్పటి ప్రధాని నెహ్రూ ఆ హ్వానం మే రకు పాట్నా వద్ద గంగానదిపై బ్రిడ్జిని తమ బృందంతో ని ర్మించారు. తుంగ భద్ర ప్రాజెక్టు రూపశిల్పి కూడా ఆయనే.ఒకసారి విదేశీ పర్యటనకు డబ్బులు అవసరం కాగా మైసూర్‌ బ్యాంక్‌లో తనవద్ద ఉన్న ప్రభుత్వ రుణపత్రాలను తాకట్టుపెట్టారు. బ్యాంక్‌ సిబ్బంది, ప్రజలు విశ్వేశ్వరయ్య నిజాయితీని మెచ్చుకున్నారు. గంధపు చెక్క వలే సేవలో అరిగిపో కానీ ఇనుము వలే తుప్పుపట్టవద్దనేది ఆయన జీవితలక్ష్యం. 
తిరుమల మొదటి ఘాట్‌ మార్గానికి 1946లో రూట్‌మ్యాప్‌ రూపొందించిన వ్యక్తి మన విశ్వేశ్వరయ్య. విశ్వేశ్వ రయ్యను భార తరత్న బిరుదుతో ప్రభుత్వం సత్కరించింది. 1962 ఏప్రిల్‌ 12న మోక్షగుండం దివంగతులయ్యారు. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 15వతేదీని ఇంజనీర్స్‌ డేగా నిర్వహిస్తండడం గర్వకారణం. 

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు

Scroll to Top
Share via
Copy link