వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొవ్వూరులో
నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, మాజీ హోమ్ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు, రైతులు, ysrcp నాయకులు ఆధ్వర్యంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో పాల్గొని RDO ఆఫీస్ కి వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ నీటికి రైతులకు కావలసిన ఎరువులు అందించలేదని, అదేవిధంగా చాలామందికి ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించలేదని అన్నారు. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటచేలకు ఇన్పుట్ సబ్సిడీ కల్పించ కుండా రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు.


