సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక హలో స్కిన్ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి అనగా తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు పాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అరుదైన అక్షర నిరంతర సాధకుడు తెలుగు రచనలు తిరుగులేని రహదారిని నిర్మించుకున్న సహృదయ సంపన్నుడు కాళోజి అని అన్నారు. ఈ సందర్భంగా కాళోజి రచనలపై సదస్సును నిర్వహించి పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు అనంతరం ప్రముఖ విశ్రాంత ఫార్మసిస్టు గోకవరపు కాశీవిశ్వేశ్వరరావు ను సాహితీ సామ్రాజ్యం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, ఎలపు ఉమామహేశ్వరరావు, ఎల్ల పు నాగలక్ష్మి, బర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


