తణుకు రోడ్ రన్–2025 రెండో ఎడిషన్ వాల్ పోస్టర్ను స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. డిసెంబరు 7న తణుకులో నిర్వహించ తలపెట్టిన తణుకు రోడ్ రన్ – 2025 (రెండో ఎడిషన్) పోస్టర్ విడుదల చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు, యువతను ఒకచోట చేర్చి ఆరోగ్యం, ఫిట్నెస్, మాదకద్రవ్య రహిత జీవనం గురించి అవగాహన పెంచుతుందని తెలిపారు. రోడ్ రన్ నిర్వాహకులు తమ నుంచి ఏ సహకారం కావాలన్నా అందిస్తామని ఆరిమిల్లి రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్ దువ్వూరి విశ్వతేజ మాట్లాడుతూ ఈ ఏడాది ‘యూత్ ఎగైనెస్ట్ డ్రగ్స్ – రన్ ఫర్ లైఫ్, రన్ ఫర్ ఫ్యూచర్’ అనే శక్తివంతమైన సామాజిక సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటిలో సభ్యులైన మాజీ సైనికులు తణుకు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తణుకు కూటమి నాయకుల పాల్గొన్నారు.


