ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తణుకు పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు
కలగ నాగ వెంకట రామ్ కుమార్,
ఇంపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్,
విభాష్యం కేశవరావు
ఎస్.వి.ఎస్. ఈ.ఎం. హైస్కూల్ ప్రిన్సిపాల్,
మిద్దె సూరిబాబు
సన్ షైన్ ఈ.ఎం. హైస్కూల్ కరస్పాంటెడ్,
ముద్దన శ్రీనివాస్ రావు
గవర్నమెంట్ స్కూల్ టీచర్,
సుబ్బారావు గారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ టీచర్
వీరందరినీ ప్రెసిడెంట్ పవన్ కుమార్ సెక్రెటరీ రామకుమార్ ట్రెజరర్ చోడే గోపి టీచర్స్ ని శాలువాలతో పూలమాలలతో సర్టిఫికెట్స్ తో
సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ద్వారా టీచర్స్ డే వంటి మంచి కార్యక్రమాలను చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని గవర్నమెంట్ టీచర్స్ డే గా గుర్తింపునివ్వడం మంచి పరిణామం అన్నారు. గురువులను సత్కరించుకోవడం మంచి సంప్రదాయమని చీకటి నుంచి వెలుగుని చూపించేది గురువని ప్రతి విద్యార్థి గురువునుండే చదువు విజ్ఞానం నేర్చుకుంటారని అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వావిలాల సరళ దేవి మాట్లాడుతూ విద్యార్థి దశలో విద్యార్థు లు గురువులను గౌరవిస్తూ విద్యను అభ్యసించిన వారు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళతారని గురువుని గురువుగానే నమస్కరించాలని గౌరవించాలి అని తెలిపారు, నేటి విద్యార్థులకు గురువుల పట్ల వినయ విధేయతలు తగ్గుతున్నాయని అది ఎంత మాత్రం సమాజానికి మంచిది కాదని, గురువులు కొవ్వొత్తులతో సమానమని వారు కరిగిపోతూ విద్యార్థులను జ్యోతిలా ప్రకాశింప చేస్తారని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లైన్ మెంబర్స్ అయిన డాక్టర్ సత్యవతి మేడం, కే శ్యామల, ఏ అన్నపూర్ణాదేవి, వి నాగలక్ష్మి, m.జ్యోతి, రమేష్ తదితరులు పాల్గొని గురువులను పుష్పాలతో సత్కరించుకున్నారు.
అనంతరం డాక్టర్ సత్యవతి మేడం సెక్రెటరీ రాంకుమార్ ట్రెజరర్ గోపి సత్కరించిన టీచర్స్ ఈ సభను ఉపాధ్యాయుల దినోత్సవం గురించి మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ పబ్లిక్ స్కూల్ ది స్కూల్ యాజమాన్యం, విద్యార్దినీ విద్యార్ధులు పాల్గొన్నారు.


