సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

సాహితి సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ గురువు శుశ్రోషయే జ్ఞాన సాధనం విద్యార్థుల అభివృద్ధికి విజ్ఞానమని అన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు చోరపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్వేపల్లి జన్మదినోత్సవం భారత సమాజానికి ఉపాధ్యాయ దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా గురువులకు గురువు సర్వేపల్లి జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించగా పలువురు వక్తలు సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత విశేషాలు వివరించారు. అనంతరం విశ్రాంతి ఉపాధ్యాయులు చోరపల్లి సత్యనారాయణను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ చైర్మన్ ములగాల శ్రీనివాసు పోస్టల్ సూపరింటెండెంట్ మంగు సూర్య ప్రకాష్, ఇంటి నాగేశ్వరరావు, బర్రె శ్రీనివాసు, ఆర్ .వి .బి. సత్యనారాయణ, ఆర్. శ్రీనివాసు, డి.వాసుదేవ వసంతరాయుడు, పి విజయ భాస్కర్, దాడి ధన ప్రసాద్, ఏలూరి చంద్రశేఖరరావు, రామదాసు వెంకటేశ్వరరావు, డి.బాపిరెడ్డి, ఎం శ్రీనివాసు, తిర్రే రాజు, జక్కాపార్వతి, జక్క కావ్య ప్రమీన తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link