శ్రీ వినాయక చవితి మహోత్సవముల సందర్భంగా ఉండ్రాజవరం గ్రామం సంత మార్కెట్ వద్ద గల వినాయక మందిరం వద్ద గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఉండ్రాజవరం పరిసర గ్రామాల నుండి సుమారు 2000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి స్వామి ప్రసాదన్న స్వీకరించారని ఈ కార్యక్రమానికి సహృదయంతో విరాళములు ఇచ్చి సహకరించిన దాతలకు కమిటీ సభ్యులు ఆవుపాటి ఆచారి, ఆవుపాటి ఏడుకొండలు, పెదగాడి శ్రీను బ్రదర్స్, శీలం శ్రీను, ఉండ్రాజవరం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మాచినేని మధు, ఏలూరు బ్రహ్మాజీ, వై.కృష్ణ, ఆవుపాటి శ్రీను, ఆవుపాటి బ్రహ్మం తదితరులు అభినందనలు తెలిపారు.


