రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన గురువారం తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వేల్పూరు గ్రామనివాసి సుప్రసిద్ధ నాదస్వర విద్వాన్ శ్రీ కావలి పురపు కృష్ణారావు ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీవీ రేడియో ఆర్టిస్టుగా సువర్ణ సింహతలాట పతాక గ్రహీతగా కూడా సుప్రసిద్ధులు అయిన కృష్ణారావు, అతనితో పాటు సహా వాయిద్యాలలో సహకరించే నిష్ణాతులైన కావలిపురపు సత్యనారాయణ, గుమ్మలూరి వెంకట్రావు, మలపర్తి సాయిబాబా, రౌతు సాయిబాబా వాయిద్య కళాకారులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీరు ప్రదర్శించిన నాద స్వరార్చనకు శ్రోతలు పలువురు ఆనందంతో వేదికపైనే నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.


