సింగపూర్‌ తెలుగు సమాజం స్వర్ణోత్సవ వేడుకలు

మాజీ అధ్యక్షుడి హోదాలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

తెలుగు వారు ఎక్కడ ఉన్నా మత తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ మరింత అభివృద్ధి సాధించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. సింగపూర్‌ తెలుగు సమాజం స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సింగపూర్‌ మరీనా బే సౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో సింగపూర్‌ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడి హోదాలో పాల్గొని మాట్లాడారు. సింగపూర్‌లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు అంతా కలిసికట్టుగా తెలుగు సమాజాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసికెళ్లాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

Scroll to Top
Share via
Copy link