బాబు మోసాలపై ప్రతి గడపకు ప్రచారం చేయండి

41వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్

విశాఖపట్నం: ఆగస్టు 26 (కోస్టల్ న్యూస్)

18 నెలల కూటమి పాలనలో ఇచ్చిన హామీలపై బాబు చేసిన మోసాలు ప్రతి గడపకు వెళ్లి తెలియపరచాలని 41 వ వార్డు వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ కార్యకర్తలకు సూచించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పై మంగళవారం ఉదయం వార్డు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో చెప్పింది ఒకటి చేస్తుందొకటి అని విమర్శించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కంటే అదనంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించామని గుర్తు చేశారు. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతో సంక్షేమాన్ని రెట్టింపు ఇస్తామని ప్రజలకు ఆశ చూపి గద్దెనెక్కరన్నారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ వంటి పథకాలు అటకెక్కించారన్నారు. ఉన్న పెన్షన్లను కుంటి షాకులతో ఊడగోడుతున్నారని ఆరోపించారు. పేద ప్రజల సంతోషంగా ఉండాలంటే మళ్ళీ వైఎస్సార్సీపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link