శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతుల విగ్రహాల పంపిణీని తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వావిలాల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏకేటిపి స్కూల్ యందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతుల విగ్రహాలను శ్రీ తారకపురి లైన్స్ క్లబ్ స్థాపించిన సందర్భంగా మొదటి కార్యక్రమంగా చేపట్టామని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పితాని దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులను పూజించి భగవంతుని సేవతోపాటు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. శ్రీ తారకపురి లయన్స్ క్లబ్ సెక్రటరీ ఎన్.వి రామకుమార్ గెట్ మెంబర్ వావిలాల సరళ దేవి, ఏకేటిపి స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి గణపతి లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మెంబర్స్ బెజవాడ సూరిబాబు, లయన్ బత్తుల రమణ, లయన్ వి. సన్నీ, లయన్ కే.శ్యామల, లయన్ బెజవాడ సత్య శ్రీ, లయన్ గుప్తా రమేష్ తదితరులు పాల్గొన్నారు.


