చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి – నవతరం పార్టీ జాతీయఅధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

చిలకలూరిపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రైతులకు మెరుగైన సేవలు అందించాలి.. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రంగానికి మొత్తం రూ. 48,340 కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.24-08-2025 ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట అగ్రికల్చర్ఈమార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం సభలో విశిష్ట అతిధిగా అయన పాల్గొని మాట్లాడుతూ బడ్జెట్‌లో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు రూ. 12,401 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ. 12,773 కోట్లు,అన్నదాత సుఖీభవ,పీఎం కిసాన్ పథకాలకు రూ. 9,400 కోట్లు,ఉచిత పంటల బీమాకు రూ. 1,023 కోట్లు,
విత్తన రాయితీ పంపిణీకి రూ. 240 కోట్లు,
ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ. 40 కోట్లు,ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రూ. 61 కోట్లు,వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 219 కోట్లు,రైతులకు వడ్డీ లేని రుణాల కింద రూ. 250 కోట్లు,డ్రోన్ల రాయితీకి రూ. 80 కోట్లు,పశుసంవర్థక శాఖకు రూ. 1,112 కోట్లు,మత్స్య రంగానికి రూ. 540 కోట్లు,
ఉద్యాన శాఖకు రూ. 931 కోట్లు,సహకార శాఖకు రూ. 239 కోట్లు, కేటాయింపులు. చేసిందని అలాగే, 7.78 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేయడం, 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు ఈ బడ్జెట్‌లో ఉన్నాయన్నారు.ఈ వ్యయం రైతులకు మేలు చేకూర్పడం, వ్యవసాయంపై సాంకేతికతను కూడా ఎక్కువగా ఉపయోగించడమే ఈ వ్యవసాయ బడ్జెట్ లక్ష్యం అని వివరించారు.

Amc చైర్మన్ గా షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ గా పిల్లి కోటిని ఎంపిక చేయడం తో పాటు కమిటీ సభ్యులను కూడా సామర్థ్యం ఉన్న వారిని ఎంపిక చేసారని మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని అభినందించారు.ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నీ రకాల అభివృద్ధి, ప్రజా సమస్యలు గురించి పార్లమెంట్ లో గళమెత్తుతూనే ఉన్నారని అన్నారు.కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, చంద్రబాబు, మోడీ, పవన్ నాయకత్వం రైతులకు వరం అని అన్నారు.సభలో విధ్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు,నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, బిజెపి పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, బిజెపి పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమ కుమార్, యువ మోర్చా జిల్లా నేత పులుగుజ్జు మహేష్,జనసేన పార్టీ ఇంచార్జ్ తోట రాజా రమేష్, జనసేన యువనాయకుడు మండలనేని చరణ్,మాజీ ఎమ్మెల్యే కందిమళ్ళ జయమ్మ,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని, మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు,టీడీపీ నేతలు నెల్లూరు సదా శివరావు, మురకొండ మల్లిబాబు, పఠాన్ సమద్ ఖాన్, మద్దిబోయిన శివ, మద్దుమాల రవి, తెలుగుదేశం,బిజెపి, జనసేన నేతలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link