ముంపుకు గురైన పంటచేలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఇరగవరం మండలంలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పరిఫలాలను కాపాడేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచించారు ఈ సందర్భంగా బుధవారం మార్టేరు వరి పరిశోధనా స్థానం నుండి వచ్చిన శాస్త్రవేత్తల బృందం ఇరగవరం మండలంలో పలు గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఇరగవరం అర్జునుడి పాలెం కావలిపురం గ్రామాలలో ముంపుకు గురైన పరిఫలాలను పరిశీలించి మాట్లాడుతూ పిలక దశలో నీటి ముంపునకు గురైన చేలలోని నీటిని బయటకు తరలించి ఎకరానికి 20 కేజీల యూరియా 10 నుండి 15 కేజీల పొటాష్ చల్లుకోవాలని ఉన్న నీటి వల్ల వరి దుబ్బులు కుళ్ళిపోకుండా ఉండడానికి ఒక గ్రాము కార్బన్డిజం లేదా రెండు గ్రాముల కార్బన్డిజం, మాంకోజబ్, ఒక లీటర్ నీటికి కలిపి దుబ్బు బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వై.రాఘవేంద్రరావు, వి.ఏ.ఏ. ఆర్ఎస్ కే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link