గత నాలుగు రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా అత్తిలి మండలంలో పల్లపు ప్రాంతాల్లో ఉన్న వరి పంట సుమారుగా 2000 ఎకరాల్లో నీటి ముంపునకు గురి అవ్వడం జరిగిందనీ మండల వ్యవసాయ అధికారి టి.రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా అత్తిలి, ఈడూరు, కొమ్మర గ్రామాలకు చెందిన పల్లపు ప్రాంతాలలో నీటి మునిగిన వరి చేలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎం.టి.యు 1318, స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయని అన్నారు. పంటఊడ్చిన వెంటనే నీట మునిగి మొక్కలు చనిపోయిన ఎడల మనేదలు వేసుకోవాలనీ, ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళ నివారణకు లీటరు నీటికి 1.0 గ్రా. కార్బెన్డిజిమ్ లేదా 2.0 గ్రా కార్బెన్డిజిమ్ + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పిలకలదశలో మునిగితే సాధారణ రకాలు 5 రోజుల వరకు ముంపును తట్టుకుంటాయని అన్నారు.
పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత్త త్వరగా నీటిని తీసివేసి ఎకరానికి 20 కిలోల యూరియా మరియు 10 – 15 కిలోల పొటాష్ అదనంగా వేసుకోవాలనీ మండల వ్యవసాయ అధికారి రైతులకు సూచించారు.


