ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలి – జిల్లా ఉప వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వాకా ప్రసాద్

ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాకా ప్రసాద్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్సిలో సిబ్బంది హాజరు పిహెచ్సి డాక్టర్లు అందిస్తున్న ఓపి, ఐ.పి. సేవలు ఆసుపత్రి ప్రసవములు, ల్యాబ్ సేవలు, నేషనల్ డీవర్మింగ్ డే మోపప్ డే, ఐ hip S,p,l ఫారమ్స్ ఆన్లైన్, ఆర్ సి హెచ్ సేవలు, గర్భిణీ స్త్రీలు శిశు జననాలు, NCD CD 3.0, సర్వ పనితీరు 104, 108 వాహన వైద్య సేవలు, RNTCp టిబి 100 రోజుల టీవీ ముక్తభారత్ సీజనల్ డిసీజెస్, స్వర్ణాంధ్ర 20 47 సంవత్సరం వెబ్ పోర్టల్ మొదలగు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి రికార్డుల పరిశీలించారు, సంబంధిత వైద్యాధికారికి, ఆరోగ్య సిబ్బందికి వాటి నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం వానాకాలం సంక్రమించే అంటువ్యాధుల పట్ల ప్రజలకు ఎల్లవేళలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి సిహెచ్ఓ రమేష్ రెడ్డి, డీఈవో శేఖర్, పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ వై మౌనిక, సిహెచ్ఓ ఎస్.కె ఖాన్ సాహెబ్, పీహెచ్ఎన్ రాణి, సూపర్వైజర్స్ మూర్తి, మంగతాయారు పీహెచ్సీ స్టాఫ్ నర్స్ ఎండి. హాజీ మునిసా బేగం, ఎల్టి ప్రసాద్ రావు వైద్య సిబ్బంది A.N.M. ఆశా వర్కర్ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link