పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి.గీతాబాయి ఆకివీడులో అశ్వని మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది . ఈ తనిఖీలలో ఏపీఎంసిఇ చుట్ట పరిధిలో నిబంధనలు పాటించుచున్నది లేనిది పరిశీలించి ఆసుపత్రులు రికార్డులు పరిశీలించడం జరిగినది. అదేవిధంగా పి.సి. పి. ఎన్. డి. టి. చట్టపరిధిలో కొత్తగా ఈ ఆసుపత్రి నందు స్కానింగ్ సేవలు అనుమతులు కొరకు దరఖాస్తు చేసుకున్న సందర్భంగా అక్కడ నిబంధనలు మేరకు ఏర్పాట్లు చేసినది లేనిది పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగినది. ఏవరైనా లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తప్పనిసరిగా ప్రైవేటు ఆసుపత్రులలో నిర్వహణ రుసుము చార్ట్ ప్రదర్శించాలని ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం పరిధిలో నియమ నిబంధనలు అందరూ పాటించాలని ఆదేశించారు.


