కాల్దరి గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వర్ణాంధ్ర 2047 విజన్‍లో భాగంగా స్వచ్ఛాంధ్ర

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం

ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందాలని పిలుపు

ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధన ప్రతిజ్ఞ చేయించిన మంత్రి కందుల దుర్గేష్

ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: స్వాతంత్ర్యం వచ్చి 2047నాటికి 100 ఏళ్లు కాబోతున్న సందర్భంగా ప్రజల భాగస్వామ్యంతో దేశం వికసి త్ భారత్ కావాలని, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మారాలని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిం చారు.శనివారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలుచేస్తూ మరోవైపు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ను కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.ఈ క్రమంలో ఈ- వ్య‌ర్ధాల‌ను స‌రైన రీతిలో తొల‌గించ‌క‌పోతే వాటి నుంచి వెలువ‌డే లెడ్ వంటి ర‌సాయ‌నాలు ద్వారా ప్రజలకు ఎంతో ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తాయ‌ని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్ర‌జ‌ల్లో ఈ-వ్య‌ర్ధాల పై అవ‌గాహ‌న కల్పించాలన్న ల‌క్ష్యంతోనే రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర – స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మం చేపట్టిందని, తద్వారా ఈ-వ్యర్థాలను సేక‌రించి శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో తొల‌గించేందుకు ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. ఈ-వ్యర్థాలపై ప్రజలకు అర్థవంతమైన భాషలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి ఈ సందర్భంగా ప్రజలతో మంత్రి దుర్గేష్ స్వచ్ఛాంధ్ర సాధన ప్రతిజ్ఞ చేయించారు. ఈ- వేస్ట్ కలెక్షన్ సెంటర్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్ల‌లో పాడైన టీవీ,ఫ్యాన్ లు, మిక్సీ, గ్రైండర్ లు తదితర ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా లేదా విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వల్ల వాయుకాలుష్యం పెరుగుతుందని, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశముందని అన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత సమస్యను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ-వ్య‌ర్ధాల సేక‌ర‌ణ కేంద్రంలో అంద‌జేస్తే వాటిని స‌రైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. లేదనుకుంటే దానికి వెలకట్టైనా అందజేయవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగించే ప్రతి ఒక్కరూ రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనే మూడు విషయాలను గుర్తుంచుకోవాలని వివరించారు. . మొదటి అంశంగా ప్రజలంతా అవసరమైన మేరకే ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించాలని సూచించారు. రెండో అంశంగా ఏదైనా వస్తువు పాడైతే కొత్తది కొనకుండా ఉన్నదానిని వినియోగంలోకి తెచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. మూడో అంశంగా వస్తువు పూర్తిగా పనిచేయకపోతే రీసైకిల్ చేయాలన్న అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజలందరూ తమ పరిధిలోని మున్సిపల్, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఈ-వేస్ట్ సేకరణ కియోస్క్ లకు అందజేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిపి స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.. ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ప్రత్యేకంగా తీసుకున్న ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఫౌల్ట్రీ ఫెడరేషన్ అధ్య క్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఇంచార్జ్ ఎంపీడీవో కె.ఆంజనేయ శర్మ, తహసిల్దార్ పి. ఎన్.డి వి. ప్రసాద్, సర్పంచ్ చీపుళ్ళ కుమారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు కోమట్లపల్లి వీర్రాజు, కాల్ధరి ఎంపీటీసీ చెట్టే నవీన్, నాయకులు వి. బాలాజీ, బాలాజీ, తూము శేఖర్, మద్దిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link