ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో PMSMA (ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభయాన్) కార్యక్రమంలో భాగంగా నిస్సా హాస్పిటల్ డాక్టరు తణుకు డా. అయేషా ఖాన్ MD GYNIC గర్భిణీలను ఉచితంగా పరీక్షచేసి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి. వైద్యాధికారి డాక్టర్ ఆర్. ఎస్.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి శిశు సురక్ష కార్యక్రమంలో గర్భిణీల అందరికి బీపీ, షుగరు, పరీక్షలు నిర్వహించి తద్వారా హైరిస్క్ వారిని గుర్తించి, వారికి ముందుగానే చికిత్స అందించడం జరుగుతుంది. కావున గర్భిణీలు క్షేమంగా సులభ ప్రసవాలు జరిగే అవకాశాలు ఉంటాయని తెలియచేశారు. ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ప్రసవించిన తల్లులకు జననీ సురక్ష యోజన పధకం క్రింద 1000 రూపాయలు పోషకాహారం నిమిత్తం అకౌంట్ ద్వారా జమచేయబడతాయి కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. సాధారణ ప్రసవాలు వల్ల తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎం.సుబ్రమణ్యం, పబ్లిక్ హెల్త్ నర్స్ కె.డి.వి.ఎల్ కుమారి, పర్యవేక్షకులు జిన్నూరి శ్రీనివాసు, స్టాఫ్ నర్సు, సంధ్య, మహిళ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


