ఆటోమొబైల్ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా పేరుపొందిన ” అతుల్ ఆటోస్” లిమిటెడ్ విశాఖపట్నంలో ఆటోస్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో అతుల్ ఆటోస్ ప్రతినిధులు పలు విషయాలను పంచుకున్నారు, నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆటోల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని సమస్త ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మీడియాతో రాంకోర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కెవిఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ అతుల్ ఆటోస్ ప్రవేశపెట్టిన కొత్తతరహా ఆటోలో వినూత్నమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయన్నారు. ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధిని పొందే వారిని ప్రత్యేకంగా ఆటోడ్రైవర్ ఆటోలు ఎక్కువ మైలేజీ వచ్చే విధంగా పర్యావరణాన్ని కాపాడుతూ పర్యావరణహితంగా ఈ ఆటోలు రూపొందించినట్లు తెలిపారు. ఇంజన్ పరంగా మన్నికతో తయారు చేసినట్లు వివరించారు. అనంతరం సౌత్ ఇండియా హెడ్ కే రామారావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆటోమొబైల్ రంగంలో సంచలనం కలిగే విధంగా ఏఐ టెక్నాలజీని తమ ఆటోలలో వినియోగించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఉపాధి హామీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నట్టు కూడా తెలిపారు దీనికి రాంకోర సంస్థ ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అతుల్ ఆటోస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేంద్ర శర్మ మాట్లాడుతూ ఆడ మగ అనే తేడా లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఎవరైనా అతుల్ ఆటోస్ ద్వారా స్వయం జీవనోపాధి పొందడానికి ఉత్తమమైన ఆటో తెలిపారు. ఈ మూడు చక్రాల ఆటోలు నడపడం చాలా తేలికని వివరించారు. అతుల్ గ్రీన్ టెక్ డైరెక్టర్ ప్రతి కౌడియ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో డ్యూయల్ బ్యాటరీ తో స్వయం అభివృద్ధిగా తయారైన వాహనాలు తమవని తెలిపారు. ఈ టెక్నాలజీతో దేశంలోనే మొట్టమొదటిసారిగా తయారైన ఆటోలు అని తెలిపారు. 30 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్ లో తమ సర్వీస్ సెంటర్లు నెలకొల్పినట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చేరువయ్యేందుకు వినూత్న ప్రణాళికలతో ముందుకు వస్తున్నట్లు వివరించారు. ఈ ఆటో ఎగ్జిబిషన్లో రాంకోర్ ప్రతినిధులు అతుల్ ఆటోస్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, విశాఖ ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ఆసక్తిగా ఆటోలను తిలకించారు.


