మంచి ఆహారఅలవాట్లు పరిశుభ్రత పాటించే విధంగా చైతన్యపరచడం ఆరోగ్యదినోత్సవ ముఖ్యోద్దేశం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాహితీ సామ్రాజ్య ఆధ్వర్యంలో స్థానిక హలో స్కిన్ హాస్పిటల్ ప్రాంగణమందు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అన్నారు. ఉత్తమ ఆరోగ్యపు అలవాట్లు దైనిందిన జీవితంలో మానవాళి పాటించాలని అన్నారు. జనరల్ సర్జన్ వైద్య నిపుణులు డాక్టర్ శీలం అశ్వినికుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారని అన్నారు. జనరల్ వైద్య నిపుణులు డాక్టర్ గుత్తుల బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ మంచి ఆహార అలవాట్లు పరిశుభ్రత పాటించే విధంగా చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం మన చేతుల్లోనే అనే అంశంపై సదస్సు నిర్వహించి పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం జనరల్ సర్జన్ వైద్య నిపుణులు డాక్టర్ శీలం అశ్విని కుమార్, జనరల్ వైద్యనిపుణులు డాక్టర్ గుత్తుల బాలసుబ్రమణ్యాలను చర్మవ్యాధి నిపుణులు డా. పుచ్చల శ్రావ్య కృష్ణను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ కోడూరి చంద్రహాస వర్మ, వరిగేటి రాజు, కోడూరి రామ కుమార వర్మ, నాయుడు రమ్య, తాడేళ్ళ పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link