గోల్డెన్ యూత్, షరాఫ్ బజార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రత్న గణపతిని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం శనివారం దర్శించుకున్నారు. కమిటీ తరపున పొట్టి రత్నబాబు రత్న గణపతి దర్శనం చేయించి స్వామి వారి ప్రత్యేక లడ్డు,శేష వస్త్రం అందించి నందుకు రావు సుబ్రహ్మణ్యం కృతజ్ఞతలు తెలిపారు.క్యూబిక్ జిర్కొనియా డైమండ్స్, వివిధ రకాల కలర్ స్టోన్స్, బంగారు, వెండి జరీ అంచులతో అత్యంత సుందరాకారునిగా గణపతి విగ్రహం తయారు చేయించడంలో నిర్వాహకులు చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. నిర్వాహకులు అందరికి అభినందనలు తెలిపారు.స్వామి వారిని దర్శించుకునేందుకు ఊరేగింపు కోసం చిలకలూరిపేట ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, ఊరేగింపు ద్వారా స్వామి దర్శనం కనుల పండుగగా జరగనుందని తెలిపారు.30 సంవత్సరాలనుండి గణేశుని సేవలో షరాఫ్ బజార్ తరించడం, స్వామి ఆశీస్సులు వారు పొందడమే కాకుండా దర్శించిన వారందరికీ లభించేలా చేయడం గొప్ప విశేషం అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.


