కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించిన ఆరిమిల్లి
నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవల మరణించారు. ఈ సంధర్బంగా శనివారం కేంద్రమంత్రి గృహంలో భూపతిరాజు సూర్యనారాయణరాజు చిత్రపటానికి తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత అయిదు నెలలుగా వర్మ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తమ కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు తండ్రి ఆరోగ్య చికిత్స వివరాలు అడిగి […]









