వార్త‌లు

విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజుకి టీజెఫ్ ప్రతినిధులు చిరు సత్కారం

విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పరశురామరాజుని తెలుగు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం చీఫ్ అడ్వైజర్ ముళ్లపూడి కోటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ జార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నందకుమార్ విశాఖ జిల్లా టీజెఫ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి పీటర్ ప్రదీప్. ఈ కార్యక్రమంలో పాల్గొని పరశురామరాజుని అభినందించారు ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలుగా వారధిగా నడుస్తూ […]

వార్త‌లు

భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ) అభినందన సత్కారసభ

ఆదివారం భీమవరంలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ (బిజెపి వర్మ) అభినందన సత్కారసభ యందు పాల్గొని అభినందనలు తెలిపిన జిల్లా బి.జే.పి.నాయకురాలు, మాజీ ఏపి రెరా మెంబర్, మాజీ తణుకు మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక. అనంతరం జరిగిన పశ్చిమగోదావరి జిల్లా బి.జే.పి. విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బి.జే.పి.నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

సోమవారం మార్చి 24 న కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ – కలెక్టర్ పి.ప్రశాంతి

ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం మార్చి 24 వ తేదీ సోమవారం యధావిధిగా కలక్టరేట్ , డివిజన్, మండల కేంద్రంలో, మునిసిపల్ కార్పొరేషన్ పురపాలక సంఘం పరిధిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో అదే విధంగా డివిజన్, మునిసిపల్ , మండల కేంద్రంలో ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను

వార్త‌లు

రుషికొండ బీచ్ కు ‘బ్లూఫ్లాగ్’ ధ్రువీకరణ పునరుద్ధరణపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

రుషికొండ బీచ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చి బ్లూ ఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ ‘బ్లూఫ్లాగ్’ పునరుద్ధరణపై మాట ఇచ్చి నిలబెట్టుకున్నామన్న మంత్రి దుర్గేష్ ‘బ్లూఫ్లాగ్’ పునరుద్ధరణ కోసం కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపిన మంత్రి దుర్గేష్ ప్రోత్సహించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ రాష్ట్రంలో మరికొన్ని బీచ్ లకు బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖలోని

వార్త‌లు

స్కిన్నెరపురం అభివృద్ధిలో అందే సత్యనారాయణ కృషి – భావితరాలు ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

గ్రామంలో అందే సత్యనారాయణ విగ్రహం ఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ అందే సత్యనారాయణ భావితరాలు ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. అందే సత్యనారాయణ విగ్రహాన్ని అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ స్కిన్నెపురం గ్రామం నుంచి రాజకీయ జీవితం

వార్త‌లు

పెరవలి మండలపరిషత్ సర్వసభ్య సమావేశం

ఆదివారం పెరవలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పేదలు మరింత అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ క్షయ వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం అందిస్తున్న మందులను వాడుతూ పౌష్టికాహారం క్రమం తప్పకుండా

వార్త‌లు

మే నుంచే కొత్త పింఛన్లు – శుభవార్త చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లపై సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా 5 లక్షల మందిని అర్హులుగా గుర్తించామని, త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. అయితే, 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు అందజేయనున్నట్టు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా దాదాపు 5 లక్షల

వార్త‌లు

ఫారం పాండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.చదలవాడ

నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సేద్యపు నీటికుంట(ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నరసరావుపేట శాసనసభ్యులు డా.చదలవాడ అరవిందబాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు రైతులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

వార్త‌లు

ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌ డే’ – మంత్రి లోకేష్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సమగ్ర వికాసమే లక్ష్యంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇప్పటివరకు నెలలో మూడో శనివారం మాత్రమే ఉన్న ‘నో బ్యాగ్ డే’ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి శనివారం అమలు చేస్తామన్నారు. ఆ రోజు విద్యార్థులకు క్విజ్‌లు, సమకాలీన అంశాలపై డిబేట్లు, సదస్సులు, క్రీడలు, వివిధ పోటీలు నిర్వహిస్తామని లోకేశ్‌ తెలిపారు.

వార్త‌లు

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లపై ఎవరైనా బెట్టింగ్ లకు పాల్పడితే కఠినమైన చర్యలు – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. గతంలో బెట్టింగులకు పాల్పడిన పాత నేరస్తుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి పై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ ఎస్పీ తెలిపారు. ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడినా, గుంపులు గుంపులుగా కూర్చుని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబ సభ్యులు తమ బిడ్డలు కానీ, తమ భర్తలు

Scroll to Top