ఉగ్రవాదాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఎం

దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం ఇరగవరం మండల కన్వీనర్ కామన మునస్వామి డిమాండ్ చేశారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల జరిపిన దాడుల్లో చనిపోయిన వారికి కొవ్వొత్తులతో సిపిఎం పార్టీ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కామన మునీస్వామి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేశామని గొప్పలు చెబుతున్నా బిజెపి ప్రభుత్వానికి ఈ ఉగ్రవాదం సవాలుగా మారిందని అన్నారు. ఉగ్రవాదాన్ని మతంతో ముడి పెట్టరాదని మునిస్వామి అన్నారు. ఉగ్రవాదము ఎక్కడ ఉన్నా ఐక్యంగా అంతమందించాలని దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుము బిగించాలని మునిస్వామిఅన్నారు . కాశ్మీర్లో జరిగిన సంఘటన భద్రత దళాల వైఫల్యంగా కనిపిస్తుందని దేనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మునుస్వామి అన్నారు. సాంద్రస్యాన్ని మతసామరస్యాన్ని దేశంలో శాంతిని నెలకొల్పుటకు ప్రజలందరూ మతాలకు అతీతంగా పోరాడాలని అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అంతమందించడంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఎన్నికలు వచ్చే సందర్భంలో బిజెపి ప్రభుత్వము ప్రజల్లో భయాందోళన చూపిస్తూ యుద్ధ వాతావరణం కల్పించే విధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తుందని ఈ విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జుత్తిగా రామాంజనేయులు, గుత్తిల శివయ్య బొంతు నాగబాబు, ప్రజాసంఘాల నాయకులు పాల సత్యనారాయణ, పేచ్చేటి నాగేశ్వరరావు, పేచ్చేటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link