మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన స్వచ్చ భారత్ మిషన్ శిక్షణా తరగతులు లో భాగంగా చివరి రోజు శుక్రవారం సదరు శిక్షణ రెగ్యులేషన్ యాక్ట్ ఏజ్ ఫీల్డ్ లెవెల్ మరియు క్రియేట్ అవేర్నెస్ ఆన్ యూజ్ ఏజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్ లో భాగంగా ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలు మరియు ప్లాస్టిక్ వాడకం వలన ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా నిర్మూలించాలి, ప్లాస్టిక్ స్థానంలో ఎలాంటి వస్తువులు వాడకం వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుందో ప్రజల్లో అవగాహన కల్పించడం , సంబంధిత నిబంధనలు గురించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే విధానాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ శిక్షణ ఇవ్వడం జరిగింది.
సదరు శిక్షణా కార్యక్రమము లో సంబంధిత నిబంధనలు మరియు చట్టాల అమలుపై క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే విధానాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది హాజరయ్యారు.



