తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని మరియు మద్యం షాపులకు సంబంధించిన పర్మిట్ రూమ్ లో మరియు బార్లలో మాత్రమే మద్యం సేవించాలని, అలాకాకుండా బహిరంగ ప్రాంతాల్లో, రహదారుల పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న 4 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తణుకు స్టేషన్ పరిధిలో గల అనధికారిక మద్యం విక్రయాలపై కేసుల నమోదు చేస్తున్నాము మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇరగవరం మండలం కత్తవపాడు, ఇరగవరం తణుకు మండలం తేతలి, తణుకు పట్టణంలో మొత్తం నాలుగు కేసులు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది. మద్యం షాపులకు కేటాయించిన పర్మిట్ రూమ్ లోనూ మరియు బార్లలో కాకుండా మరే ఇతర ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ మహిళలకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే వారిపై కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి హెచ్చరించారు.



