దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమానికి ఏ.పి.లో పెద్ద పీట

రాబోయే మూడేళ్ళలో అర్జునుడుపాలెం అభివృద్ధికి కృషి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇరగవరం మండలం అర్జునుడుపాలెం లో పర్యటించిన ఎమ్మెల్యే

దేశంలో ఏ రాష్ట్రంలోనూ సంక్షేమానికి ఖర్చు చేయని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మొదటి రోజే దాదాపు 98 శాతం పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రణాళికలు చేసినట్లు తెలిపారు. ఒకటో తేదీ సెలవు రోజు వస్తే ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయంలో రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చి రూ. 1000 పెంచడానికి రూ. 250 పెంచుకుంటూ పోతానని చెప్పి నాలుగు దఫాలుగా ఐదేళ్లలో పెంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. గత వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 80 వేల కోట్లు పెన్షన్లు పంపిణీ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండేళ్లలోనే 72 వేల కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు ప్రతి నెల 36 వేల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 15 కోట్లు మేర పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.  గత ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల ప్రజాప్రతినిధులు చులకన భావంతో మాట్లాడే వారిని గుర్తు చేశారు. ఇదే గ్రామంలో ధాన్యం డబ్బులు రాలేదని అడిగిన రైతును నోరు మూసుకొని కూర్చో అని దుర్భాషలాడిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని తెలిపారు. రాబోయే మూడేళ్ల కాలంలో అర్జునుడు పాలెం గ్రామంలో కనీస సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. తాగునీటి సమస్యకు సంబంధించి అవుట్లెట్ ఇబ్బందిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link