తణుకు నియోజకవర్గం తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2025-2026 రబీ సీజన్‌కు ఏర్పాటు చేసిన “ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని “ రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు మరియు స్థానిక నాయకులు, రైతులు, అధికారులతో ప్రారంభం.
ఈ సందర్బంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేస్తుందని తెలిపడమైనది. రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతన్నలు దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకుని, సరైన ధర పొందే అవకాశం లభిస్తుంది. రైతులకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరడమైనది.


