ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ కు ఎమ్మెల్యే రాధాకృష్ణ పరామర్శ

ఎమ్మెల్సీ వంక రవీంద్రనా«ద్‌ను బుధవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి, సీపీఐ, మహిళా సమాఖ్య సీనియర్‌ నాయకులు వంక నాగమణి మృతి చెందడంతో ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. నాగమణి భర్త వంక సత్యనారాయణ సైతం ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలో అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు సాధించారన్నారు. అనంతరం నాగమణి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Scroll to Top
Share via
Copy link