తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి డా. కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక పద్మశ్రీ ఫంక్షన్ హాల్లో సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన సత్కార సభ అట్టహాసంగా నిర్వహించారు.
ఈ క్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు హాజరై పదవి విరమణ పొందిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మాట్లాడుతూ గత ఐదేళ్లుగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్ల పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నప్పటికీ భయపడే నాయకుడు లేరని స్పష్టం చేశారు.
అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ బూతు రాతలపై నిరసన తెలుపుతూ హైదరాబాద్లోని ఏబీఎన్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నాయకులను అణచివేయాలని చూడడం దుర్మార్గమని ఆమె ఖండించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరు ఉమా బాల,నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, తణుకు నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కొట్టు వెంకట్ (నాగు),మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


