ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు

తణుకు పట్టణానికి చెందిన దాత చిట్టూరి సుజాత చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంతో మంది ప్రయాణికుల దాహార్తిని తీర్చే విధంగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. చిట్టూరి అచ్యుత రామ ప్రసాద్ జయంతి పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు తణుకు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో సుమారు రూ. 2 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్వో ప్లాంటును ఎమ్మెల్యే రాధాకృష్ణ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. తణుకు పట్టణానికి చెందిన చిట్టూరి సుజాత ఎంతో మందిని ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారని కొనియాడారు. ఆర్థిక వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు చేసే గుణం కొందరికే ఉంటుందని అలాంటి కోవకు చిట్టూరి సుజాత చెందుతారని అన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. లయన్స్ క్లబ్, స్వర్ణ లయన్స్ క్లబ్ గత 20 ఏళ్లుగా తణుకు పట్టణంలో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రజలను సైతం భాగస్వాములు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link