తాడేపల్లిగూడెం: శ్రీ పరాభవ నామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభకరం కావాలని, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రగతి పదంలో ముందుకు సాగాలని, శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నూతన తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా, గురువారం శ్రీశ్రీశ్రీ బలుసులమ్మ వారిని ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామదేవతశ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవంలోఈ సంవత్సరం ఉగాది పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుందని అన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ జాతర నిర్వహించే మహాభాగ్యాన్ని అమ్మవారు కల్పించారని, ప్రతి ఒక్కరు జాతరలో పాల్గొని
బలుసులమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ప్రభుత్వాలు మారినా,అధికారంలో ఎవరు ఉన్నా,జాతర నిర్విఘ్నంగా కొనసాగాలని అన్నారు.ప్రతి 5 సంవత్సరాలకు జాతర నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం సుభిక్షంగా ఉండేవిధంగా అందరూ కృషి చేయాలని అన్నారు. తాడేపల్లిగూడెంలో ఎవరి ఇంట వివాహం జరిగినా,ముందుగా గ్రామ దేవత బలుసులమ్మ వారికి చలిమిడి, పానకాలు సమర్పించిన తర్వాతే వివాహం జరగటం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా అమ్మవారి ఆలయం ఎలాంటి అభివృద్ధి లేకుండా నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. 40 సంవత్సరాల తర్వాత మొదటిసారి తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో జాతర నిర్వహించామని,మరలా ఇప్పుడు నిర్వహించే అవకాశం అమ్మ వారు కల్పించారని అన్నారు. జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం భగత్ సింగ్ కాలనీ,అనంతమ్మ తల్లి టిట్కో గృహాలశ్రీశ్రీశ్రీ అంకాలమ్మ దేవస్థానం కొమ్ముగూడెం,తల్లాలమ్మ తల్లి, వెంకటరమణ గూడెం పెంటపాడు, పుంతలోముసలమ్మ తల్లి వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజి,చేపల రమేష్, మద్దాల మణికుమార్, కసిరెడ్డి మధులత, పాలూరు వెంకటేశ్వరరావువాడపల్లి సుబ్బరాజు, పైబోయిన వెంకటరామయ్య, నీలపాల దినేష్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, గట్టెం నాని, కర్రీ సురేష్, ఒట్టికూటిఅబ్బో, దాసరి శ్రీనివాస్, నల్లగంచి రాంబాబు, పిడుగు రామ్మోహన్ బ్రదర్,బైన పాలపు ముఖేష్, నల్లగంచి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు


