ఆలపాటి నాగేశ్వరరావు సేవలు ఎందరికో స్పూర్తి

ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు విద్యాకమిటీ చైర్మన్ అయినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు అకాలమరణానికి చింతిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. మండల మానవతా శాఖ ప్రతీనెలా నెల 22వ తారీకున నెలవారి సమావేశం జరుగవలసిఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదావేయడం జరిగిందని ఉండ్రాజవరం మండలం మానవతా సంస్థ ప్రెసిడెంట్ ఉప్పలపాటి శ్రీనివాసు తెలిపారు. ఆ సమావేశాన్ని ఆదివారం ఉండ్రాజవరం లింగాలపేట రామాలయంలో నెలవారీ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఉభయగోదావరి జిల్లాల సెంట్రల్ కమిటీ చైర్మన్ మరియు విద్యాకమిటీ చైర్మన్ అయినటువంటి ఆలపాటి నాగేశ్వరరావు అకాలమరణానికి చింతిస్తూ ఆయన మన మానవతా సంస్థకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి రెండు నిమిషాలు సభ్యులందరూ మౌనం పాటించారు. అదేవిదంగా సంస్థ అభివృద్ధికి సభ్యులంతా శ్రమించాలని ఈ నెలలో చేయవలసిన నైతిక సహకారాలు, ఆత్మీయ సహకారాలు మరియు సేవా కార్యక్రమాలు గురించి చర్చ జరిగిందని ప్రెసిడెంట్ ఉప్పలపాటి శ్రీనివాసు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link