“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత

“జాగృతి” డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా సాధికారత సాధనలో భాగంగా ‘జాగృతి” డిజిటల్ మహిళా సంఘం

సంఘం అధ్యక్షురాలు భూపతిరాజు శశిరేఖ, సెక్రటరీ భూపతిరాజు వాణి, కోశాధికారి యలమంచిలి రేణుక, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం. జయలక్ష్మి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళలు తయారుచేస్తున్న ఆహార పదార్థాలు, హస్తకళా ఉత్పత్తులు, గృహోపయోగ వస్తువులు వంటి ఉత్పత్తులను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులకు చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలియజేసారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో మహిళలు ఇంటివద్ద నుంచే తమఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించే అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు.
మహిళల కృషికి సరైన గుర్తింపు, న్యాయమైన ధర, విస్తృతమైన మార్కెట్ అందించడంలో డిజిటల్ వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, దేశం బలపడుతాయని డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link