అంతర్జాతీయ మహిళా దినోత్సవం గోడపత్రిక విడుదల

(భీమవరం) మార్చి 8వ తేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆదరణ సేవా ఫౌండేషన్ రూపొందించిన  గోడపత్రిక శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్  చదలవాడ నాగరాణి  మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలి అంటే చదువు ప్రామాణికంగా తీసుకోవాలని విద్య మధ్యలో నిలిపివేసిన బాలికలను గుర్తించి వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చేరేలా చేసి వారి చదువును కొనసాగేలా స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా స్త్రీల అభ్యున్నతికి పేదల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్న ఆదరణ సేవా ఫౌండేషన్ అధ్యక్షురాలు, డీ వీఎంసీ సభ్యులు వి. ఆశాజ్యోతి ని కలెక్టర్  చదలవాడ నాగరాణి  అభినందించారు.

Scroll to Top
Share via
Copy link