రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం బిజెపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారితో కలిసి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా: ముళ్ళపూడి రేణుక విలేఖరులతో మాట్లాడుతూ….
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందించిన 2026-27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్ ద్వారా గ్రామీణ ఉపాధి, రైతులు, యువత, మహిళలు మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ బడ్జెట్ ద్వారా సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ వివిధ రంగాల్లో నూతన పథకాలు, విధానాలు మరియు ఆర్థిక మద్దతులు ప్రకటించబడ్డాయి అన్నారు.
1. రైతులు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలక నిర్ణయాలు.
2. మహిళలు మరియు SME/ఉద్యమ రంగానికి సమర్థ సహకారం
3. యువతకు ఉద్యోగాలు, నైపుణ్యం, ఇన్నోవేషన్ రంగాలకు మద్దతు.
4. ఆర్థిక అభివృద్ధి & నిర్మాణాత్మక పెట్టుబడులు
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టతో రూపొందించిన ఈ బడ్జెట్ భారతదేశాన్ని ఆర్థికంగా మరింత బలపరిచే దిశగా ఉంది అని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశం తెలియజేసినారు.
ఈ పత్రికా సమావేశంలో
రాష్ట్రకార్యదర్శి బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి , అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. ఆర్. కె రాజు, మద్దిపాటి రజనీ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


