ఏసీబీ వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

👉తణుకులో ఏసీబీ మెరుపు దాడి

👉లంచం తీసుకుంటూ ఏసీబీ కు చిక్కిన హెడ్ కానిస్టేబుల్

👉 తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

👉కేసు పరిష్కారం పేరుతో బాధితుడిని భయపెట్టి మొత్తం రూ.25,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం..ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతోమెరుపు దాడి చేసి, లంచం స్వీకరిస్తున్న సమయంలో సుబ్బారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
👉ప్రస్తుతం సుబ్బారావును ఏసీబీ అధికారులు విచారిస్తూ, కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Scroll to Top
Share via
Copy link